కొవిడ్-19 వ్యాక్సినేషన్‌ను పూర్తిస్థాయిలో పర్యవేక్షించడంతో పాటు, టీకా కావాలనుకునే వారు నమోదు చేసుకోవడానికి వీలుగా ‘కో-విన్’ పేరిట ఓ ఉచిత మొబైల్ అప్లికేషన్ ను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రూపొందించింది.
వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకున్నవారి వివరాలు సహా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన డేటాను ఇందులో పొందుపరుస్తారు.
దేశవ్యాప్తంగా మొత్తం టీకా పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ‘కో-విన్’ దోహదపడుతుందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.