Home > EMPLOYEES NEWS > CM REVANTH REDDY – నేడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం

CM REVANTH REDDY – నేడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం

BIKKI NEWS (MARCH 10) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు, జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో అన్ని రకాల సంఘాల నేతలతో సమావేశం (CM REVANTH REDDY REVIEW MEETING WITH EMPLOYEES UNIONS TODAY ) కానున్నారు. ఈ మేరకు సీఎంవో వర్గాలు పలు సంఘాలకు సమాచారాన్ని అందించాయి. దాదాపు 70కి పైగా సంఘాలను ఈ సమావేశానికి ఆహ్వానించినట్టు తెలిసింది.

ఈ సమావేశంలో పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని సంఘాల నేతలు భావిస్తున్నారు. పీఆర్సీ కమిటీకి ఇటీవలే అన్ని సంఘాలు ప్రతిపాదనలు సమర్పించాయి. పీఆర్టీయూ 50, టీఎస్‌ టీఎన్జీవోలు 51 శాతం, టీజీవోలు 40 శాతం ఫిట్‌మెంట్‌ను కోరారు. ఫిట్‌మెంట్‌ సహా పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయడం, సీపీఎస్‌ రద్దు, బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, జీవో-317తో నష్టపోయిన వారికి న్యాయం చేయడం, పెండింగ్‌ బిల్లులను జారీ చేయాలని, ఈహెచ్‌ఎస్‌ అమలు వంటి అంశాలను ప్రస్తావించాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.