BIKKI NEWS (MAY 05) : CM REVANTH REDDY ON EMPLOYEES ISSUES TODAY. ఉద్యోగ సంఘాలు ధర్నాలకు వెళదామని ప్రకటించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాల ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
CM REVANTH REDDY ON EMPLOYEES ISSUES TODAY
రాష్ట్ర ఆదాయానికి మించి ఖర్చు చేయలేమని, నన్ను కోసినా సరే ఆదాయానికి నుంచి ఖర్చు చేయలేనని ఉద్యోగ సంఘాలను. ఉద్దేశించి అన్నారు.
ప్రభుత్వానికి సహకరించాల్సిన ఉద్యోగ సంఘాలే సమరం అంటే ఎలా అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రానికి ఎలాంటి అప్పు పుట్టడం లేదని కావున ఉద్యోగ సంఘాల కోరికలను తీర్చలేనని ఖరాఖండిగా చెప్పారు.
ఉద్యోగుల కోరికలు తీర్చడానికి ఏ ప్రభుత్వ పథకాలను ఆపాలో వారే చెప్పాలని లేదా వేటి ధరలు పెంచాలో చెప్పాలని ప్రశ్నించారు.
గత ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఉద్యోగుల పెండింగ్ బిల్లలను పెట్టి పోయిందని, 11 శాతం వడ్డీలు కట్టడానికి సరిపోతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఉద్యోగులు సమరం ప్రకటించింది నాపైన కాదని తెలంగాణ ప్రజల పైన అని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులు కావద్దని ఈ సందర్భంగా హితవు చెప్పారు.
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జూన్ 9 వరకు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ధర్నాలకు సిద్ధమవుతున్నట్లు నిన్న ప్రకటించింది. అలాగే మే 7 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్