గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

BIKKI NEWS (NOV. 06) : CM REVANTH REDDY MEETS GOVERNOR. తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన సామాజిక, ఆర్ధిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారికి వివరించారు. ఈ సర్వే ప్రక్రియకు సంబంధించిన అన్ని అంశాలను తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ గారితో భేటీ అయ్యారు.

CM REVANTH REDDY MEETS GOVERNOR

2025 లో దేశ వ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో తెలంగాణ తరహాలో కుల గణనను పరిగణలోకి తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సీఎంగారు గవర్నర్ గారిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని సీఎంగారు చెప్పారు.

గవర్నర్ గారిని కలసిన వారిలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ఎంపీలు పోరిక బలరాం నాయక్ గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి గారు ఉన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు