కృతజ్ఞత సభకు భారీగా తరలిన యాదాద్రి భువనగిరి జిల్లా సీజేఎల్స్ – మెరుగు లింగయ్య

సిద్దిపేటలో కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞత సభ విజయవంతం చేయాలని 711 సంఘం పిలుపు మేరకు మంత్రి హరీష్ రావు మీద ఉన్న అభిమానంతో 711 అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మెరుగు. లింగయ్య జనరల్ సెక్రటరీ చిప్పలపల్లి అంజయ్య సహకారంతో సుమారుగా 67 మంది సీజేఎల్స్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ని మొక్కుకొని సిద్దిపేటకు భారీ సంఖ్యలో చేరుకుని సభను విజయవంతం చేసినారని మెరుగు లింగయ్య తెలిపారు.

తెలంగాణ తొలి పీఆర్సీ 2020 ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా పీఆర్సీ ఆమలుతో పాటు బేసిక్ పే కల్పించడం పై హర్షం వ్యక్తం చేస్తూ ఈ సభకు హజరవుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొండల్, జిల్లా నర్సింహ, మందడి వెంకట్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్నీ జిల్లాల కంటే ఎక్కువగా చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా 711 సంఘ కాంట్రాక్ట్ అధ్యాపకులు పాల్గొన్నారు.