పిబ్రవరి 1 నుండి విద్యా సంస్థలు ప్రారంభం – సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మంత్రులు మరియు కలెక్టర్లతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అనేక కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది.

ఇందులో భాగంగా ఈ నెలాఖరులోగా ఉద్యోగులకు పదోన్నతులు బదిలీలు పదవీ విరమణ వయస్సు పై కీలక నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.

అలాగే విద్యాసంస్థలను ఫిబ్రవరి 1 నుంచి పునఃప్రారంభించడానికి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 9 మరియు ఆపై తరగతులు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.

రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు.

ధరణి పోర్టల్ లో చేయాల్సిన మార్పులు చేర్పులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని తెలిపారు.

ఖాళీగా ఉన్న ఆన్ని పోస్టులను ఒకేసారి భర్తీ చేయాలని పేర్కొన్నారు

Follow Us@