మంత్రులు, కలెక్టర్ లతో కేసీఆర్ సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో పలు కీలక అంశాలపై చ‌ర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు ఉన్నతస్థాయి సమావేశం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కొన‌సాగుతుంది.

రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, వైద్యారోగ్య, విద్య, అటవీశాఖలతోపాటు ఇతరశాఖల ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చ‌ర్చిస్తున్నారు.

విద్యాసంస్థల ప్రారంభం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ధరణి, తెలంగాణకు హరితహారం, గ్రామగ్రామాన నర్సరీలతోపాటు, కరోనా టీకా పంపిణీకి కార్యాచరణపై ప్రధానంగా చర్చ జరుగుతోందని సమాచారం.

రాష్ర్టంలో విద్యాసంస్థ‌ల పునఃప్రారంభంపై తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. ఏ త‌ర‌గ‌తి నుంచి త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌నే అంశంపై స‌మాలోచ‌న‌లు జ‌ర‌ప‌నున్నారు. త‌ర‌గ‌తులు ఏ విధంగా నిర్వ‌హించాలి? ఇత‌ర రాష్ర్టాల్లో అనుస‌రిస్తున్న విధానంపై కూడా చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోనున్నారు. దీంతో విద్యాసంస్థ‌ల పునఃప్రారంభం పై నేడు స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ప‌రీక్ష‌ల విధానంలో మార్పులపై కూడా చ‌ర్చించ‌నున్నారు. స‌ర్కారు అనుమ‌తిస్తే ఈ నెల 18 లేదా 20వ తేదీ నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభిస్తామ‌ని విద్యాశాఖ స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే త‌ర‌గ‌తుల ప్రారంభంపై ప్ర‌భుత్వానికి ఇంట‌ర్ బోర్డు ప్ర‌తిపాద‌న‌లు పంపింది.

Follow Us@