హైదరాబాద్ (జూలై – 06): తెలంగాణ ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న 143 మంది కాంట్రాక్ట్ సూపర్ వైజర్ లను గ్రేడ్-3 ఎక్స్ టెన్స్న్ ఆఫీసర్ (సూపర్ వైజర్ )లుగా క్రమబద్ధీకరించడానికి సీఎం అమోదం లభించినట్లు సమాచారం.
వీరి క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సీఎంవో నుండి ఆదేశాలు వెలువడినట్లు విశ్వసనీయ సమాచారం.
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే ప్రక్రియలో భాగంగా విడుదల చేసిన జీవో నెంబర్ 16 ప్రకారం వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ వరుసగా ఉత్తర్వులు వెలువడుతున్న విషయం తెలిసిందే.