హైదరాబాద్ (అక్టోబర్ 03) : తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అందించే అల్పాహార పథకమైన “సీఎం బ్రేక్ ఫాస్ట్” పథకాన్ని అక్టోబర్ 6వ తేదీనే శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి. CM BREAKFAST SCHEME STARTS FROM OCTOBER 6th
షెడ్యూల్ కంటే ముందే ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకర్గంలోని జడ్పీహెచ్ఎస్ రావిర్యాల నుంచి ప్రారంభించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది.
వాస్తవానికి దసరా రోజే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సి ఉంది. కానీ విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించడం, పండుగల కారణంగా కాస్త ముందుగానే ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులను ఆదేశించారు.