బదిలీలపై ముఖ్యమంత్రి కార్యాలయం నుండి మాకు సమాచారం రాలేదు…

ప్రభుత్వ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు బదిలీలు జరపాలని దానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయాలని గత నెల 15వ తేదీన సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

నేపథ్యంలో 20 రోజులు గడుస్తున్నా ఎలాంటి మార్గదర్శకాలు రాకపోవడంతో ఈ రోజు GCLA 475 ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ ఆధ్వర్యంలో శోభన్, శైలజా, భాస్కర్ తదితర కాంట్రాక్టు అధ్యాపకులు విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ కలిసి బదిలీల మార్గదర్శకాల త్వరగా విడుదల చేయాలని కోరారు.

దీనిపై విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ బదిలీలకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం ఇంతవరకు నుండి తమకు ఎలాంటి సూచనలు రాలేదని, వచ్చిన వెంటనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు.

అలాగే కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులకు సంబంధించిన రెన్యూవల్ ప్రోసిడింగ్ కూడా త్వరగా విడుదల చేయాలని కోరగా సాకూలంగా స్పందించారు.

Follow Us@