మూడు సంఘాలు కలిసి వస్తేనే బదిలీలు – పల్లా రాజేశ్వర్ రెడ్డి

పల్లా ప్రసంగం

నల్గొండ జిల్లాలో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షులుగా ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తామని 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

తదనుగుణంగా జీవో నెంబర్ 16ను విడుదల చేశామని, జీవో నెంబర్ 16 ద్వారా అందరినీ క్రమబద్ధీకరిస్తామని అస్సాం తరహా ప్రయోజనాల కంటే జీవో నెంబర్ 16 ద్వారా కలిగే ప్రయోజనాలు ఎక్కువ అని ఈ సందర్భంగా తెలిపారు. అడ్వకేట్ జనరల్ తో మాట్లాడి 16 జీవో మీద ఉన్న కేసు ను వెకేట్ చేపించి క్రమబద్ధీకరిస్తామని హమీ ఇచ్చారు.

అలాగే బేసిక్ పే 37,100 /- వేతనం గాని, ఒక్కరోజు బ్రేక్ లేకుండా 12 నెలల సర్వీసును ఇవ్వడం గానీ, 12 నెలల వేతనం ఇవ్వడం గానీ కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే సాధించుకున్నామని తెలిపారు.

వచ్చే ఎప్రిల్ నెల నుండి నెలనెలా వేతనాలు ఇప్పిస్తానని దాని కోసం ఏ అధికారి చుట్టూ తిరగవద్దని తెలిపారు

అలాగే ప్రస్తుతం ఎక్కువ మంది కాంట్రాక్టు అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్య అయినా బదిలీలు ఇప్పటికే జరిగి ఉండాల్సిందని, కానీ సంఘాల మద్య ఉన్న భిన్నాభిప్రాయాల వలనే ఆలస్యమైందని దానితో అధికారులు కూడా బదిలీల ఫైల్ ను పక్కన పెట్టారని తెలిపారు.

బదిలీల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన తాను, బదిలీల ప్రక్రియ పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నానని, కాకపోతే మూడు సంఘాలు కలిసి ఒకే అభిప్రాయంతో వచ్చిన రోజే బదిలీలు జరుగుతాయని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులు, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us @