వెంటనే బదిలీ మార్గదర్శకాలు విడుదల చేయాలి – ఆసిపాబాద్ జిల్లా ఆర్జేడీ యూనియన్

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి , బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసి రెండు నెలలు కావస్తున్నా , ఇప్పటికీ ఇప్పటివరకు బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలలో తీవ్రమైన జాప్యం జరుగుతుంది.

అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా జాప్యం జరుగుతున్నదని కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు. జూనియర్ కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంబానికి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో….బదిలీల మార్గదర్శకాలు విడుదల చేయలేక పోవడం ఆందోళనకు దారి తీస్తుంది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసి బదిలీల ప్రక్రియను త్వరగా ముగించాలని కాంట్రాక్ట్ లెక్చరర్లు కోరుతున్నారు.

గత 13 సంవత్సరాల నుంచి జూనియర్ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులకు బదిలీ నిర్వహించకపోవడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులతో వివిధ రూపాల్లో అధికారులకు మరియు మంత్రులకు విన్నవించిన టువంటి ఫలితంగా ఈ మధ్యనే సీఎం కేసీఆర్ బదిలీపై సానుకూల నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో బదిలీల మార్గదర్శకాలు విడుదలలో తీవ్రమైన జాప్యం జరుగుతుండటంతో 3 వేల కాంట్రాక్ట్ అధ్యాపకుల కుటుంబాలు బదిలీల కొరకు చూస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్ సిబ్బందికి బదిలీలు జరిగాయని కేవలం జూనియర్ కళాశాలల్లో మాత్రమే బదిలీలు జరగకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

Follow Us@