బదిలీల పై రాజకీయమా.?

ఒప్పంద అధ్యాపకులు సర్వీస్ రూల్స్ లేని ఉద్యోగులు వీరి బదిలీల విషయం కమీషనర్ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా బదిలీలు జరుపమని ఆదేశించి నెల గడచిన విద్యా శాఖ నుండి ఇంతవరకు మార్గదర్శకాలు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

13 సంవత్సరాలు ఒక మనిషి జీవితంలో అత్యంత విలువైన కాలం నివాస ప్రాంతానికి దగ్గర కళాశాలలో ఖాళీలు ఉండి తల్లిదండ్రులకు‌, భార్య పిల్లలకు సుదూరంగా పని చేయాల్సి రావడం అత్యంత భాధకర విషయం.

మానవత్వం చూపండి అని ప్రతి రోజు ఎదో ఒక నాయకున్ని, అధికారిని వేడుకోని గొంతు లేదు. అయినా మానవత్వంతో చేయాల్సిన బదిలీల పై కనీసం కనికరించిన నాయకుడు లేడు.

గత 13 ఏళ్లుగా మహిళా అధ్యాపకురాళ్ళ దుఖాఃనికి ఈ వ్యవస్థలోని మంత్రుల, అధికారుల, కనీసం సొంత సంఘ నాయకుల గుండెలు కరుగలేదు. చివరకు కేసీఆర్ నిర్ణయంతో అయినా కరుగుతాయోమో అనుకుంటే అవి ఇంకా రాటు దేలాయి, బదిలీ కోసం కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్న మహిళ అధ్యాపకురాళ్ళ గుండెలను చివరి పొర వరకూ చిలూస్తూ వారి 13 సంవత్సరాల వనవాసానికి మళ్లీ పరీక్ష పెడుతున్నాయి.

రాజకీయం పక్కా రాజకీయం పట్టుమని 4 వేల మంది లేని ఒప్పంద అధ్యాపకులను మూడు ముక్కలు చేసి ముచ్చటగా ఆడుతున్న వికృత నాటకం. మానవత్వం మచ్చుకైనా లేని నికృష్ట రాజకీయ నాటకం. ఈ నాటకంలో నలిగిపోయోది మాత్రం ప్రాథమిక సభ్యులే.

ఒక ఉద్యోగికి కనీసం ఉండాల్సిన హక్కులను సాదించలేనీ వారు బదిలీలు నిలిపివేయడానికి పై చేసిన లాబీయింగ్, రాజకీయంలో కనీసం పదవ వంతు కృషి చేసిన ఎన్నో ఒప్పంద అధ్యాపకుల సమస్యలకు పరిష్కారం దొరికేది.

నేను బోధించే కళాశాలలోనే రిటైర్మెంట్ అయ్యోవరకు తిష్ట వేస్తా స్వయనా ముఖ్యమంత్రి బదిలీ చేయండి అన్న నేను కదల, అడవిలో పాఠాలు చెప్పేవాడు అడవిలోనే ఉండాలి. జిల్లా కేంద్రంలో ఉన్న వాడు జిల్లా కేంద్రంలోనే కడుపులో సల్ల కదలకుండా ఉండాలి. కాదు కూడదు అంటే మేము ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు వేయం అంటూ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రచారం చేస్తూ, బదిలీ మార్గదర్శకాలు రాకుండా చేస్తుంటే అధికారులు, మంత్రి స్థాయి నాయకులు తమ విధులు మరిచిపోవడం శోచనీయం.

“నివాస ప్రాంతానికి దగ్గర కళాశాలలో ఖాళీలు ఉండి తల్లిదండ్రులకు‌, భార్య పిల్లలకు సుదూరంగా పని చేయాల్సి రావడం అత్యంత భాధకర విషయం.”

వ్యాసకర్త :: రామచంద్ర రెడ్డి, సీజేఎల్ ఇన్ కెమిస్ట్రీ.

మహాబూబ్ నగర్ జిల్లా.

+91 99085 40772.

Follow Us@