బదిలీల పై నీలి నీడలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు బదిలీలు చేయమని విద్యా శాఖ అధికారులను ఆదేశించి నెల రోజులు గడుస్తున్నా ఇంకా బదిలీ మార్గదర్శకాలు రాలేదు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది ఒప్పంద అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవుడు వరమిచ్చినా పుజారి కనకరించనట్లు తమ పరిస్థితి ఉందని ఒప్పంద అధ్యాపకులు వాపోతున్నారు.

అయితే గైడ్ లైన్స్ తయారీలో తీవ్ర జాప్యానికి కారణం ఒప్పంద అధ్యాపకుల మద్య బదిలీల విషయంలో ఉన్న భిన్న వాదనలు కారణమని తెలుస్తోంది. బదిలీ కొరుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నపటికీ బదిలీలను అతి తక్కువ మంది ఒప్పంద అధ్యాపకులు కోరుకుంటున్నట్లు నివేదికలు వెళ్లిన కారణంగా బదిలీల ప్రక్రియ సందిగ్ధంలో పడ్డట్లు సమాచారం.

బదిలీ మార్గదర్శకాల పైల్ హోల్డింగ్ లో ఉన్నట్లు, ఎప్పుడు జరుగుతాయో చెప్పలేని పరిస్థితి ఉందని విశ్వసనీయ సమాచారం.

Follow Us@