వెంటనే సీజేఎల్స్ బదిలీలు జరపాలి – ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం శాసనమండలి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు

ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల ల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులు ఇరవై సంవత్సరాల నుండి పని చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన క్రమబద్ధీకరణ హమీని నిలబెట్టుకోవాలని కోరారు.

అలాగే బదిలీలపై సీఎం ప్రకటన చేసి అధికారికంగా లేఖ ఇవ్వకపోవడంతో నెల రోజులు గడచిన కూడా బదిలీల ప్రక్రియ ముందుకు సాగడం లేదని వెంటనే సీఎం కేసీఆర్ బదిలీలపై అధికారికంగా లేఖ విద్యాశాఖకు పంపించి బదిలీ ప్రక్రియ త్వరగా జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీజేఎల్స్ 475 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ పాల్గొన్నారు.

Follow Us@