బదిలీ మార్గదర్శకాల పై తీవ్ర కసరత్తు.

సీఎం కేసీఆర్ సూచన మేరకు కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల బదిలీలు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు తయారు చేయడంలో విద్యా శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.

గత సోమవారం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిత్రా రామ చంద్రన్ కు బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని, జీహెచ్ఎంసీ ఎన్నికల వలన ఇప్పటికే ఆలస్యం అయినదని మౌఖికంగా సూచించారు.

ఈ నేపథ్యంలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంటర్విద్య కమీషనర్ ఉమర్ జలీల్ తో బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలలో పొందుపరచవలసిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. అయితే మరోదపా చర్చించిన తర్వాత తుది మార్గదర్శకాలు విడుదల చేయనున్నారని సమాచారం.

న్యాయ పరమైన చిక్కులు రాకుండా ::

బదిలీల ప్రక్రియ సజావుగా ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు ఎదురు కాకుండా ఉండేదుకు న్యాయ నిపుణుల సలహాలతో పకడ్బందీగా మార్గదర్శకాలు రూపొందిస్తునట్లు సమాచారం, ఈ కారణంగానే ఒకటి రెండు రోజుల ఆలస్యంతో బదిలీ మార్గదర్శకాలు విడుదలయ్యె అవకాశం ఉంది.

Follow Us@