ఈ నెలలోనే బదిలీలు జరిపించాలి – బదిలీ బాధితులు

కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల బదిలీల అంశం ఎంత తీవ్ర సమస్యను అందరికీ తెలిసిందే. వేలాది మంది కాంట్రాక్టు అధ్యాపకులు కుటుంబాలకు వందల కిలోమీటర్ల దూరంలో విధులు నిర్వహిస్తూ మానసిక, శారీరక, ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వార్షిక పరీక్షలకు తర్వాతకు వాయిదా పడటంతో బదిలీల ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో అనే ఆందోళన నెలకొంది.

గత సంవత్సరం సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన తర్వాత కూడా నెలల తరబడి అధికారుల నిర్లక్ష్యం, రాజకీయాలు కారణంగా వాయిదా పడ్డ బదిలీల ప్రక్రియ వార్షిక పరీక్షల తర్వాత జరుగుతుందని ప్రచారం తెరపైకి రావడంతో బదిలీ బాధితులు నమ్మడం జరిగింది.

మూడు సంఘాలు కలిసి ప్రభుత్వ పెద్దలకు, ఇంటర్మీడియట్ విద్యా అధికారులకు బదిలీలు జరపాలని వినతిపత్రం ఇచ్చారు. తదనంతరం కళాశాలలు భౌతికంగా తెరుచుకోవడం, విద్యా సంవత్సరం చివర్లో ఉండటం వంటి కారణాలతో బదిలీల ప్రక్రియ మరొక్కసారి ఎప్పటికి చేస్తారో తెలియని నిరవధిక వాయిదా పడింది.

బదిలీ బాధితులు కూడా విద్యా సంవత్సరం చివర్లో ఉండంంతో నూతన విద్యా సంవత్సరంలో నూతన కళాశాలకు వెళతామని సర్దిచెప్పుకొని యధావిధిగా తమ విధులకు హాజరవుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వార్షిక పరీక్షల తర్వాత బదిలీలు జరుగుతాయని స్పష్టమైన ప్రకటనను ఏ సంఘము ఏ అధికారి గానీ ఏ ప్రభుత్వం గానీ ఇంతవరకు బహిరంగంగా చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వార్షిక పరీక్షలకు తర్వాత కు వాయిదా పడటంతో అసలు పరీక్షలు జరిగేదెప్పుడు వాటి తర్వాత బదిలీలు జరిగేదెప్పుడు అనే సందిగ్ధం బదిలీ బాధితులను కలచివేస్తోంది. ఈ నేపథ్యంలో దీని మీద స్పష్టమైన ప్రకటన కోసం రాష్ట్ర వ్యాప్తంగాఉన్న బదిలీ బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఏప్రిల్ నెలలో ఆన్లైన్ తరగతులు మాత్రమే నడుస్తున్న నేపథ్యంలో ప్రాక్టికల్స్ పరీక్షలు వాయిదా పడడంతో మరియు వార్షిక పరీక్షలు మే 1 నుంచి ప్రారంభం అవుతాయనే సూచనలు కనిపించడం లేదు ఈ నేపథ్యంలో బదిలీల ప్రక్రియ పూర్తి చేయడానికి తగినంత సమయం ఉంది… కావునా ఎప్రిల్ నెలలోనే బదిలీలు జరిపించాలని ప్రభుత్వ పెద్దలను, ఇంటర్మీడియట్ అధికారులను, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘాలను బదిలీ బాధితులు వేడుకుంటున్నారు.

Follow Us@