సీఎం హమీ మేరకు బదిలీలు జరిపిస్తాం – మంత్రి హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రంలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో కాంట్రాక్ట్ అధ్యాపకులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులు ప్రస్తుతం ప్రధానంగా ఎదుర్కొంటున్న బదిలీలు అంశంపై స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హమీ ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే బదిలీ మార్గదర్శకాలు విడుదల చేసి వంద శాతం బదిలీలు జరిపిస్తామని, ఈ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని స్పష్టం చేశారు.

అదేవిధంగా నెలనెల వేతనం, క్రమబద్ధీకరణకు సంబంధించి కోర్టులో ఉన్న కేసును వెకేట్ క్రమబద్ధీకరణ జరిగే వరకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల సంఘాల ప్రతినిధులు, ఇంటర్విద్యా జేఏసీ చైర్మైన్ మధుసూదన్ రెడ్డి, కనకచంద్రం, శేఖర్, వినోద్, జిల్లా నరసింహ, కడారి శ్రీనివాస్, మాలతి తదితరులు పాల్గొన్నారు.

Follow Us@