కాంట్రాక్టు అధ్యాపకుల టీడిఎస్ కోతకు తాత్కాలిక బ్రేక్.!

ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, కళాశాలలో పనిచేస్తున్న దాదాపు 5 వేల మంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు టీడిఎస్ విధింపు గురించి సంబంధిత డిడివో లకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే కాంట్రాక్టు అధ్యాపకులకు టీడిఎస్ కోత విధించ వద్దని నిన్న ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నేతృత్వంలో 475 సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి ప్రధాన కార్యదర్శి సురేష్ మరియు ఇతర నాయకులు కలిసి ఆదాయ పన్ను శాఖ టీడీఎస్ విభాగం కార్యదర్శి ని అలాగే ఇంటర్ విద్య కమిషనర్ ని కలిసి వినతిపత్రాలు సమర్పించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సంబంధిత విషయాన్ని ఇంటర్ కమిషనర్ ఆదాయపన్ను శాఖ దృష్టికి ఈ రోజు తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయం పై ఆదాయపన్ను శాఖ నుండి వివరణ వచ్చేంతవరకు సంబంధిత కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాల నుండి టీడీఎస్ ను మినహయించవద్దని డీడీవోలకు ఇంటర్విద్యా కమీషనర్ సూచించినట్లు సమాచారం.

అయితే కాంట్రాక్టు అధ్యాపకులు tds పరిధి లోకి వస్తారా రారా అనే విషయం ఆదాయపన్ను శాఖ పునఃసమీక్ష చేయాల్సి ఉంది

Follow Us @