సీజేఎల్స్ రెన్యూవల్ జీవో సవరిస్తూ ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 3970 మంది కాంట్రాక్టు మరియు 74 మంది అవుట్సోర్సింగ్ ఇతర కేటగిరి ఉద్యోగులను ఈ సంవత్సరానికి రెన్యూవల్ చేస్తూ ఆగష్టు లో విడుదల చేసిన జీవో నంబర్ 1018 లో సవరణలు చేస్తూ ఎమెడ్మెంట్ జీవో నంబర్ 1231 ను రాష్ట్ర ఆర్ధిక శాఖ విడుదల చేసింది.

ఈ ఎమెడ్మెంట్ జీవో 1231 ప్రకారం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు “ఒప్పంద, ఇతర ఒప్పంద ఉద్యోగులకు చెల్లింపు పద్దు”లలో (300/301 & 300/302) వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది.

కానీ ఈ సంవత్సరానికి కంప్యూటర్ టెక్నీషియన్స్ మరియు ఇంటర్మీడియట్ ఒకేషనల్ విభాగంలో పనిచేస్తున్న పార్ట్ టైం హవర్లీ బెసిస్ జూనియర్ లెక్చరర్స్, ల్యాబ్ అటెండర్స్, సీనియర్ ఇన్ స్ట్రక్టర్స్ యొక్క వేతనాలను “ఇతర పద్దుల విభాగం”లో (280/284) కింద చెల్లించాలని ఆర్ధిక శాఖ ఉన్నత విద్యా శాఖకు సూచించింది.

Follow Us @