ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు – సీజేఎల్స్ మైనారిటీ సంఘం

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులకు అనేక బెనిఫిట్స్ కల్పించి‌, క్రమబద్ధీకరణ కోసం 16 జీవో ని విడుదల చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షలు రహీమ్ మైనారిటీల తరపున ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి సంపూర్ణ మద్దతు పలికారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా పర్యటించి పల్లా గెలపు కోసం మద్దతు కూడగట్టడం జరిగింది.

అలాగే బేసిక్ పే, ఒక్క రోజు బ్రేక్ లేకుండా 12 నెలల వేతనము‌ కల్పించడంలో ఎమ్మెల్సీ లో పల్లా పాత్ర తెలిసిందే కావునా రాజేశ్వర్ రెడ్డికి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో పని చేస్తున్న మైనారిటీ లెక్చరర్ లు, మరియు మైనారిటీ మిత్రులు అందరూ మొదటి ప్రాదాన్యత ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ రహీమ్, అన్సారీ, మిన్హాజ్ ఉల్ హక్ మరియు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల మైనారిటీ సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు.

Follow Us@