కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలపై జీవన్ రెడ్డి, అలుగుబెల్లి Vs సబితా ఇంద్రారెడ్డి – పూర్తి వీడియో

  • బదిలీలపై ప్రశ్నకు సమాధానం దాటవేత
పూర్తి వీడియో

అక్టోబర్ – 07వ తేదీన తెలంగాణ శాసన మండలిలో జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ. జీవన్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి లు కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల బదిలీలు మరియు వేతనంలో 10% టీడీఎస్ మినహాయింపు పై ప్రశ్నించారు.

టీ. జీవన్ రెడ్డి మాట్లాడుతూ గతేడాది నవంబర్ – 15న స్వయంగా సీఎం కేసీఆర్ కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులకు బదిలీలు జరిపించాలని ఆదేశాలు జారీ చేసిన ఏడాది గడచిన ఇంతవరకు బదిలీల పై ఒక్క అడుగు ముందుకు పడలేదని కావున బదిలీల పై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే కాంట్రాక్టు అధ్యాపకులకు ఉద్యోగ భద్రతా లేదని వీరిని కూడా ఆదాయపు పన్ను శాఖ వదలడం లేదని వేతనంలో 10% టీడీఎస్ రూపంలో కోత విధిస్తున్నారని దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవే ప్రశ్నలను అలుగుబెల్లి నర్సిరెడ్డి అడిగారు. వీటితోపాటు కొత్త నోటిఫికేషన్ లలో ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల స్థానాలను ఖాళీలుగా చూపిస్తారా లేదా అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ 10% టీడీఎస్ అంశం తమ దృష్టికి వచ్చిందని సంబంధించిన శాఖకు ఈ అంశం పై పరిశీలించాలని ఆదేశించామని తెలిపారు. ప్రస్తుతం కాంట్రాక్టు అధ్యాపకులు పని చేస్తున్న స్థానాలను ఖాళీలుగా చూపే అంశం ప్రభుత్వం చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కానీ సీఎం హమీ అయినా బదిలీలపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడం విశేషం.