వరంగల్ జిల్లా ఇంటర్ విద్యా నూతన నోడల్ అధికారికి జనరల్ స్ట్రీమ్ శుభాకాంక్షలు

వరంగల్ జిల్లా ఇంటర్ విద్యా నూతన నోడల్ అధికారిగా నియమించబడిన కే. మాధవరావుకి ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం జనరల్ స్ట్రీమ్ 269 ఆధ్వర్యంలో హార్దిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో GJLA రాష్ట్ర సహధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, జనరల్ స్ట్రీమ్ రాష్ట్ర అధ్యక్షుడు కీర్తి సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ రమేష్ బాబు మరియు వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ కుమారస్వామి, రాజకుమార్ సుధాకర్, అనిల్, వీరాంజన్, కుమారస్వామి, మల్లేష్ లు పాల్గొన్నారు.