సీజేఎల్స్ కు ఈ సంవత్సరం కూడా డిస్ట్రిక్ట్ యావరేజ్ ఉండనుందా.?

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులకు ప్రతి సంవత్సరం సర్వీసు రెన్యూవల్ చేయాలంటే వారు తాము బోధించే సబ్జెక్ట్ నందు ఫలితాలను డిస్ట్రిక్ట్ యావరేజ్ తో సమానంగా లేదా ఎక్కువగా సాదించాల్సి ఉంటుంది.

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ఒక సబ్జెక్ట్ నందు సాధించిన ఫలితాల సగటును సంబంధిత సబ్జెక్ట్ లో ఆ అధ్యాపకుడు సాధించాల్సి ఉంటుంది. లేని పక్షంలో తర్వాతి విద్యా సంవత్సరానికి రెన్యూవల్ కు అనర్హులుగా పరిగణించి సర్వీస్ లోకి తీసుకోకపోవడం జరుగుతుంది.

ఈ సంవత్సరం కోవిడ్ – 19 కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమై సెప్టెంబర్ 1నుండి ఆన్లైన్ తరగతులతో ప్రారంభమవడం మరియు పిబ్రవరి 1 నుండి భౌతికంగా తరగతులు ప్రారంభం అవనున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండటం, అలాగే విద్యార్థులు కళాశాలకు భౌతికంగా హాజరుకావాల్సిన అవసరం లేదు అన్లైన్ తరగతులు కూడా వినవచ్చనే అవకాశం ఉండనున్న నేపథ్యంలో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లకు ఉన్న డిస్ట్రిక్ట్ యావరేజ్ నిబంధనను ఈ విద్యా సంవత్సరానికి తొలగించాలని పలు కాంట్రాక్టు అధ్యాపకుల సంఘాల నాయకులు అధికారులను, ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం జరుగుతుంది.

Follow Us@