జీవో – 16 ను అమలు చేయాలి : కొల్లాపూర్ సీజేఎల్స్

కొల్లాపూర్ :: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకులు కొల్లాపూర్ లో హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కాంట్రాక్టు అధ్యాపకులు మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం మొదటి సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు సంబంధించి జీవో నెంబర్ 16న విడుదల చేసిందని ఆ జీవో అమలు పరిచే క్రమంలో కొంత మంది నిరుద్యోగులు హైకోర్టులో కేసులు వేయడం తో తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని అయినా కాంట్రాక్టు లెక్చరర్లకు బేసిక్ పై అమలు చేసి టిఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల పక్షపాతి అని నిరూపించిందని గుర్తుచేసశారు.

తాజాగా హైకోర్టు జీవో నంబర్ – 16 పై వేసిన పిల్ ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిందుకు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తొందరగా జీవో నెంబర్ 16 ను అమలు పరిచి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలని కాంట్రాక్టు లెక్చరర్ లు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర మరియు బాలికల అధ్యాపకులు శ్రీనివాస రావు, దశరధరామ, ప్రవీణ్ కుమార్, వెంకటేశ్వర్లు, రాజు, దేవదాసు, రఘు వర్ధన్, మధుసూదన్ మరియు సహఅధ్యాపకులు పాల్గొన్నారు

Follow Us @