కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులకు నెలకొక క్యాజువల్ లీవ్ చొప్పున సంవత్సరానికి ఎన్ని నెలలు సర్వీస్ చేస్తే అన్ని క్యాజువల్ లీవ్స్ ఉంటాయని 2008 లో ఇంటర్మీడియట్ కమీషనరేట్ ఒక మెమో (MEMO NO. 12754/IE/ A1/2007 – 2 HIGHER EDUCATION IE.1/AQ dated 27 – 02 – 2008) విడుదల చేసింది.
ఈ ప్రోసిడింగ్ ప్రకారం నెలకొక క్యాజువల్ లీవ్ చొప్పున సంవత్సరానికి ఎన్ని నెలలు సర్వీస్ లో ఉంటే అన్ని క్యాజువల్ లీవ్స్ ఉంటాయని, ఒక నెలలో గరిష్టంగా మూడు సీఎల్స్ మాత్రమే ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. పై మెమో ప్రకారం ప్రస్తుతం కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల సీఎల్స్ కు క్వార్టర్ సిస్టం అని ఎక్కడ కూడా పేర్కోనలేదు.
ఈ ప్రోసిడింగ్ ను జిల్లాకొక రకంగా కాదు కాదు జూనియర్ కళాశాల కొక విధంగా అమలు చేస్తున్నారు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ లు.
ఎ నెల క్యాజువల్ లీవ్ ఆ నెలలోనే ఉపయోగించుకోవాలని, ముందస్తుగా ఉపయోగించుకోరాదని అలాగే వరుసగా మూడు నెలలు సీఎల్స్ ఉపయోగించుకోకుంటే వాటిని మూడవ నెలలో ఉపయోగించుకోవాలని, ఉపయోగించుకోని పక్షంలో ఆ మూడు సీఎల్స్ నిరుపయోగం అయిపోతాయని చిత్ర విచిత్ర రూల్స్ ను ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు అమలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ కమీషనరేట్ ఇచ్చిన మార్గదర్శకాలలో ఒక నెలలో గరిష్టంగా 3 సీఎల్స్ మాత్రమే ఉపయోగించుకోవాలని ఉంది.
గత 12 సంవత్సరాలుగా ఈ సమస్యను దాదాపు 3600 మంది కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులు ప్రతి సందర్భంలో ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బదిలీలు లేక కుటుంబాలకు వందలాది కిలో మీటర్ల దూరంలో ఉంటున్న అధ్యాపకులకు ఈ రూల్స్ మెడ మీద కత్తి పెట్టినట్లు ఉన్నాయి.
ఇదే క్యాజువల్ లీవ్ ప్రోసిడింగ్స్ మీద మెదక్ జిల్లా నోడల్ ఆపీషర్ సొంతంగా రూల్స్ తయారు చేసి 2019 లో సర్క్యలర్ విడుదల చేశారు. (Circular No. SPL/ NODAL/MDK/2019 dated 28/10/2019) ఈ సర్క్యలర్ సారంశం ఎంటంటే వరుసగా మూడు నెలలు సీఎల్స్ ఉపయోగించుకోకుంటే వాటిని మూడవ నెలలో ఉపయోగించుకోవాలని, ఉపయోగించుకోని పక్షంలో ఆ మూడు సీఎల్స్ నిరుపయోగం అయిపోతాయి. చిత్రంగా తర్వాతి రోజే ఆ సర్క్యులర్ ని ఉపసంహరించుకుంటున్నట్లు మరోక సర్క్యులర్ ని (Circular No. SPL/NODAL/ MDK/2019 dated 29/10/2019) విడుదల చేసి తన అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.
అయినా కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమైన మూడు సంఘాలకు ఈ సమస్య పట్డదు. ప్రభుత్వం నుంచి ఎలాగూ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఆర్థిక భారం లేని సెలవులను ఇప్పటి వరకు సాదించలేకపోయారు. కనీసం గుడ్డిలో మెల్లగా ఉన్న ఈ సీఎల్స్ విషయంలో కూడా గత 12 సంవత్సరాలుగా నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం శోచనీయం. ఉన్న క్యాజువల్ లీవ్స్ మీద స్పష్టత కమీషనరేట్ నుండి రాబట్టెందుకు సంఘాల నాయకులు కృషి చేయాలని, సీఎల్స్ సంఖ్య మరియు ఉపయోగించే విధానం రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రాథమిక సభ్యులు కోరుకుంటున్నారు.
CJLS CASUAL LEAVE MEMO – 2008

Medak Nodal officer Circular about CJLS CLS

Medak Nodal officer Cancelled Circular about CJLS CLS
