తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులకు అస్సాం ప్రభుత్వం కాంట్రాక్టు టీచర్లకు రెగ్యులర్ టీచర్లతో సమానంగా కల్పిస్తున్న ప్రయోజనాలను సమీక్షించి తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు పరచడంపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు
ఈ లేఖ ప్రకారం GCCLA 711 సంఘం అధ్యక్షుడు కనకచంద్రం ఈ నెల మూడవ తేదీన సిద్దిపేటలో మంత్రి హరీష్ రావుని కలిసి అస్సాంలో కాంట్రాక్టు టీచర్లకు అమలు చేస్తున్న ఉత్తర్వులను అందించి క్రమబద్దీకరణ చేసే వరకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా అస్సాం తరహాలో అన్ని బెనిఫిట్స్ ను అందించాలని మంత్రి దృష్టికి తీసుకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అస్సాం ఉత్తర్వులకు సంబంధించిన పూర్వాపరాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ విద్యాశాఖ మంత్రికి లేఖ రాయడం పై కనక చంద్రం మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.