అసోం తరహా బెనిఫిట్స్ కోసం కేటీఆర్ కి వినతి.

తెలంగాణ రాష్ట్రం లోని కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులకు అసోం ప్రభుత్వం కాంట్రాక్టు టీచర్లకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా బెనిఫిట్స్ కల్పించాలని కోరుతూ ఈ రోజూ సిరిసిల్ల లో మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావు ని 711 సంఘ జిల్లా కమిటీ నాయకులు కలిసి కోరడం జరిగినది. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న బదిలీల నిర్ణయనికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది.

దీనిపై స్పందిస్తూ పూర్తి వివరాలు తెలుసుకొని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చిత్రా రామచంద్రన్ లతో చర్చించి బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగినది.

తాజాగా ఇదే అంశంపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి లేఖ వ్రాసిన విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల 711 బృందం నాయకులు కట్టయ్య, చందు, విష్ణుప్రసాద్, పర్శరాంలు పాల్గొనడం జరిగినది.

Follow Us @