కరోనాతో మృతి చెందిన సీజేఎల్స్ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి – TIPS

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు గత నెల రోజులలో దాదాపు 7 మంది COVID -19 పాజిటివ్ (కరోనా) తో చనిపోయారని వారి కుటుంబాలను మానవతా దృక్పధంతో ఆదుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి “తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి” (TIPS) విజ్ఞప్తి చేసింది.

ఇంటర్మీడియట్ విద్యా శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులకు ఎలాంటి సామాజిక, ఆర్థిక, ఉద్యోగ భద్రత లేదని ఈ అత్యవసర పరిస్థితులలో ముఖ్యమంత్రి కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులను ఆర్థిక సహాయం ప్రకటించి వారి కుటుంబాలకు చేయూతనిస్తూ ధైర్యాన్ని ఇవ్వాలని మరియు (COVID -19) కరోనాతో మరణించిన కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు వారి కుటుంబాలు జీవించడానికి సామజిక భద్రత కోసం పెన్షన్ దయార్థ హృదయంతో ప్రకటించాలని విన్నవించారు

ఈ మధ్య కాలంలో దాదాపు 7 గురు కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లు (COVID -19) కరోనా కారణంగా మృతి చెందినట్లు తెలిపారు. వారిలో హనుమాండ్లు, సుదర్శన్, అయ్యాలు, పోశెట్టి, తాళ్లపల్లి లక్ష్మయ్య, గోపాల్, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

వీరి కుటుంబాలను ఆర్థిక సహాయంతో పాటు సామజిక భద్రత కోసం పెన్షన్ ఇవ్వాలని అలాగే కరోనాతో చాలా మంది ఇంటర్మీడియట్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నందువలన వారిని ప్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ ఇప్పించాలని తెలిపారు.

Follow Us@