- సివిల్ సర్వీసులు కొరకు (100) మైనారిటీల అభ్యర్థుల కొరకు ఉచిత కోచింగ్
హైదరాబాద్ (జూన్ – 20) : UPSC (CSAT-2024) యొక్క సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా ప్రవేశం కొరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన మైనారిటీ కమ్యూనిటీస్ (అనగా ముస్లిం, క్రిస్టియన్, సిఖ్, జైన్, బుద్దిస్ట్ & పార్శి)లో ఎవరైనా జనరల్/ ప్రొఫెషనల్ డిగ్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
మైనారిటీల సంక్షేమ శాఖ నియంత్రణ పరిధిలో పనిచేస్తున్న తెలంగాణ స్టేట్ మైనారిటీస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్, మైనారిటీ విద్యార్థుల కొరకు 2023-24 విద్యా సంవత్సర కాలంలో UPSC –
సివిల్ సర్వీసులు – 2024 కొరకు ఉచిత కోచింగ్ నిర్వహిస్తోంది.
◆ రిజర్వేషన్ నియమాలు: మహిళా అభ్యర్థులకు సీట్లలో 33.33% మరియు దివ్యాంగులైన విద్యార్థులకు 05% ఉంటాయి.
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
◆ దరఖాస్తు గడువు : 26-06-2023 నుండి 13-07-2023 వరకు
◆ స్క్రీనింగ్ టెస్ట్ : 23-07-2023 (ఆదివారం) సమయం: ఉ. 10.00 గం. నుండి మ. 12.00 గం.వరకు నిర్వహించబడును.
తెలంగాణ స్టేట్ మైనారిటీస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్ లో మొదటిసారి ప్రవేశం పొందాలనుకునే మైనారిటీ అభ్యర్థులు అందరూ స్క్రీనింగ్ టెస్ట్ కు హాజరు కావలెను మరియు ప్రవేశం మెరిట్ పొ ఆధారపడి
ఉంటుంది.
తల్లిదండ్రులు/ సంరక్షకుల వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ.2.00 లక్షలకు మించరాదు.
◆ వెబ్సైట్: www.cet.cgg.gov.in/tmreis