712 పోస్టులతో సివిల్స్ నోటిఫికేషన్ విడుదల

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) దేశ అత్యున్నత సర్వీసులైన ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (IAS), ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ (IPS), ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ (IFS) వంటి 19 సర్వీసుల్లో మొత్తం 712 పోస్టుల భర్తీకి సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష 2021కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

● మొత్తం పోస్టుల సంఖ్య :: 712

● అర్హతలు :: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ ఫైనల్‌ పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా అర్హులే.

● వయోపరిమితి :: ఆగస్టు 1, 2021 నాటికి 21–32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

● ఎన్నిసార్లు రాయొచ్చు ::
జనరల్‌ అభ్యర్థులు ఆరుసార్లు రాసేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఓబీసీలు తొమ్మిదిసార్లు, ఎస్సీ/ఎస్టీలు గరిష్ట వయోపరిమితికి లోబడి ఎన్నిసార్లయినా రాసుకోవచ్చు.

● పరీక్ష విధానం :: మూడు అంచెల విధానం – సివిల్‌ సర్వీసెస్‌ ఎంపిక ప్రక్రియలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌(ఆబ్జెక్టివ్‌ టైమ్‌), మెయిన్‌ ఎగ్జామినేషన్‌(డిస్క్రిప్టివ్‌ టైప్‌), ఇంటర్వ్యూ ఉంటాయి.

● దరఖాస్తు పద్దతి :: ఆన్లైన్‌లో పద్దతి

● దరఖాస్తు ఫీజు :: రూ.100, మహిళలు, ఎస్సీ/ఎస్టీలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

● చివరి తేది :: మార్చి 24 – 2021

● ప్రిలిమినరీ పరీక్ష తేది :: జూన్‌ – 27 – 2021

● e – అడ్మిట్‌ కార్డ్‌ :: ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీకి మూడు వారాల ముందు నుంచి ఈ అడ్మిట్‌ కార్డ్‌ యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

● వెబ్సైట్ :: https://upsconline.nic.in

Follow Us@