హైదరాబాద్ (మే – 15) : కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టి ఫికెట్ ఎగ్జామినేషన్స్ (CISE X & XII RESULTS 2023) 10, 12వ తరగతుల ఫలితాలను విడుదల చేసింది.
10వ తరగతి (ఐసీఎస్ఈ) పరీక్షల్లో 98. 94%, 12వ తరగతి (ఐఎస్సీ) పరీక్షల్లో 96.93% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ రెండు తరగతుల్లోనూ బాలురతో పోలిస్తే బాలికలు ఉత్తమ ఫలితాలు సాధించారు. పదో తరగతిలో 9 మంది విద్యార్థులు 99.80% మార్కులతో తొలి స్థానంలో నిలవగా.. 12వ తరగతిలో 99.75% మార్కులతో అయిదుగురు తొలి ర్యాంకును కైవసం చేసుకున్నారని వెల్లడించారు.