ముంబయి (నవంబర్) : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్… దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ సర్కిళ్లలో 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్( CIRCLE BASED OFFICERS JOBS IN SBI ) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.
హైదరాబాద్ సర్కిల్లో 425, విజయవాడ సర్కిల్లో 400 ఖాళీలున్నాయి.
ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సర్కిల్/ రాష్ట్రంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఎస్బీఐ సర్కిళ్లు: హైదరాబాద్, విజయవాడ, అహ్మదాబాద్, , బెంగళూరు, OSBI భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, నార్త్ ఈస్ట్రన్, , జైపుర్, లక్నో, కోలకతా, మహారాష్ట్ర, ముంబై మెట్రో, న్యూఢిల్లీ, తిరువనంతపురం.
సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ : 5,447 పోస్టులు (రెగ్యులర్ ఖాళీలు – 5,280; బ్యాక్ లాగ్ ఖాళీలు- 167)
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31-10-2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
జీత భత్యాలు: రూ.36,000/- నుండి రూ .63,840/ వరకు
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు : రూ.750/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు)
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.
దరఖాస్తు గడువు : : నవంబర్ 22 – 2023 నుండి డిసెంబర్ 12 – 2023 వరకు
అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ : జనవరి 2024.
ఆన్లైన్ పరీక్ష తేది : జనవరి 2024.