BIKKI NEWS (నవంబర్ – 26) : CHINA MASTER 2023 బ్యాడ్మింటన్ సిరీస్ పురుషుల డబుల్స్ లో ఫైనల్ కు చేరిన సాత్విక్ సాయిరాజ్ & చిరాగ్ శెట్టిల జోడి నెంబర్ వన్ ద్వయం లియాంగ్ & వాంగ్ చాంగ్ జోడి పై ఓటమిపాలై రన్నర్స్ గా నిలిచారు.
హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 19-21, 21-18, 19-21 తేడాతో భారత్ ద్వయం ఓటమిపాలైంది. పురుషుల డబుల్స్ విజేతగా ప్రపంచ నెంబర్ వన్ జోడి లియాంగ్ & వాంగ్ చాంగ్ జోడి నిలిచారు.
పురుషుల సింగిల్స్ విజేతగా జపాన్ కి చెందిన కొడాయ్ నరఓకా నిలిచాడు. రన్నర్ గా జపాన్ కే చెందిన నిషిమోటో నిలిచాడు.
మహిళల సింగిల్స్ విజేతగా చైనా కి చెందిన షెన్ యూ నిలిచింది. రన్నర్ గా చైనా కే చెందిన హెన్ యూ నిలిచింది.
మహిళల డబుల్స్ విజేతగా జపాన్ కి చెందిన నమీ మత్సుయమ & షీడా నిలిచారు. రన్నర్ గా జపాన్ కే చెందిన పుకుషిమా & హిరోటా నిలిచారు.
మిక్స్డ్ డబుల్స్ విజేతగా చైనాకి చెందిన జెహంగ్ & కియాంగ్ నిలిచారు. రన్నర్ గా షియాంగ్ జే & యూ జంగ్ నిలిచారు.