Home > UNCATEGORY > జీజేసీ గర్ల్స్ హుస్నాబాద్ లో స్వయం సుపరిపాలన దినోత్సవం

జీజేసీ గర్ల్స్ హుస్నాబాద్ లో స్వయం సుపరిపాలన దినోత్సవం

BIKKI NEWS (NOV. 14) : Childrens day in GJC Girls Husnabad. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో ఘనంగా స్వయం సుపరిపాలన దినోత్సవం జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవం సందర్భంగా స్వయం సుపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.

Childrens day in GJC Girls Husnabad

ఈ కార్యక్రమానికి కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డి. రవీందర్ గారు అధ్యక్షత వహించడం జరిగింది.
కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిలు అధ్యాపకులుగా మరియు ప్రిన్సిపాల్ గా మరియు DIEO లుగా మరియు అధ్యాపక ఇతర బృందాలుగా విధులను నిర్వహిస్తూ ప్రథమ సంవత్సర విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడం జరిగింది.

డి ఐ ఈ ఓ మరియు ప్రిన్సిపాల్ గా వ్యవహరించిన విద్యార్థినిలు తరగతి గదిలో బోధనను పరిశీలించడం జరిగింది. అనంతరం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యాపకులుగా డీఐఈఓ, ప్రిన్సిపాల్, అధ్యాపకేతర బృందాలుగా వివరించిన విద్యార్థులు వారి యొక్క బోధన అనుభవాలను అనుభూతులను తెలియజేయడం జరిగింది.

అనంతరం కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీ డి రవీందర్ గారు మాట్లాడుతూ విద్యార్థులు బోధన ద్వారా నేర్చుకున్న అనుభవాలు ఎల్లప్పుడూ గుర్తుంటే అని తెలుపుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరచుకొని సరైన ప్రణాళికను ఏర్పరచుకొని లక్ష్యాన్ని సాధించాలన్నారు.

తర్వాత స్వయం సుపరిపాలన దినోత్సవంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం చేత బహుమతులను ప్రధానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమము ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీ డి కరుణాకర్ గారి యొక్క పర్యవేక్షణలో జరిగినది.

ఈ కార్యక్రమాల్లో కళాశాల అధ్యాపక బృందం యస్. సదానందం, బి. లక్ష్మయ్య, ఏ. సంపత్, ఎస్. కవిత, కే. స్వరూప, జి. కవిత, పి. రాజేంద్రప్రసాద్, అధ్యాపకేతర బృందం జూనియర్ అసిస్టెంట్ రాములు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థినిలు మొదలగు వారు పాల్గొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు