ఉత్ర్పేరకాలు కనుగొన్న ఇద్దరు శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్ర నోబెల్ – 2021

ర‌సాయ‌న శాస్త్ర నోబెల్ 2021 గాను జ‌ర్మనీకి చెందిన‌ బెంజ‌మిన్ లిస్ట్‌, అమెరికాకు చెందిన‌ డేవిడ్ డ‌బ్ల్యూసీ మెక్‌మిల‌న్‌ల‌కు వరించింది. “అణువుల‌ను నిర్మించడానికి ఎసిమెట్రిక్ ఆర్గానో కాట‌లిసిస్” అనే కొత్త మార్గాన్ని అభివృద్ధి చేసినందుకుగాను ఈ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ద‌క్కింది.

బెంజ‌మిన్ లిస్ట్‌, మెక్‌మిల‌న్‌ల ఆవిష్క‌ర‌ణ ఫార్మాసూటిక‌ల్ ప‌రిశోధ‌న‌ల‌పై గొప్ప ప్ర‌భావం చూపింద‌ని అకాడ‌మీ చెప్పింది. విజేత‌ల‌కు 11 లక్ష‌ల డాల‌ర్ల ప్రైజ్‌మ‌నీని స‌మానంగా పంచుతారు.

బెంజ‌మిన్ లిస్ట్ :: 1968లో జ‌ర్మ‌నీలోని ఫ్రాంక్‌ఫ‌ర్ట్‌లో జ‌న్మించారు. 1997లో గోతె యూనివ‌ర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్ర‌స్తుతం మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్‌కు డైరెక్ట‌ర్‌గా ఉన్నారు.

◆ మెక్‌మిల‌న్ :: 1968లో యూకేలోని బెల్‌షిల్‌లో జ‌న్మించారు. 1996లో యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పీహెచ్‌డీ చేశారు. ప్ర‌స్తుతం ప్రిన్స్‌ట‌న్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్‌గా ఉన్నారు.