జాబిల్లి నుంచి మట్టి, రాళ్లను భూమి పైకి తీసుకొచ్చేందుకు చైనా ప్రయోగించిన చాంగే-5 వ్యోమనౌక చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తవ్వకాలు చేపట్టింది. ఎంపిక చేసిన ప్రాంతంలో నమూనాలను సేకరించింది.
చాంగే-5లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్ అనే నాలుగు భాగాలు ఉన్నాయి.
1969లో మానవసహిత యాత్ర ద్వారా అమెరికా తొలిసారిగా చంద్రుడిపై జెండాను పాతింది. అమెరికా తర్వాత జాబిల్లిపై జెండా ఎగరేసిన రెండో దేశంగా చైనా అవతరించింది.
ఇది మొత్తంగా రెండు కిలోల (4.4 పౌండ్లు) రాళ్లు, మట్టిని సేకరిస్తుంది. తర్వాత తిరిగి కక్ష్యలోకి చేరి, అక్కడున్న క్యాప్సూల్లో ఈ పదార్థాలను ఉంచుతుంది. అనంతరం క్యాప్సూల్ అక్కడి నుంచి బయల్దేరి భూమిని చేరుతుంది.