CHANDRAYAAN – 3 SLEEP MODE :స్లీప్ మోడ్ లోకి రోవర్, ల్యాండర్

హైదరాబాద్ (సెప్టెంబర్ – 02) : చంద్రయాన్ – 3 ప్రయోగంలో మొదటి దశ విజయవంతంగా పూర్తి అయినట్లు ఇస్రో ప్రకటించింది. తొలిదశలో చేపట్టాల్సిన అన్ని ప్రయోగాలను ప్రజ్ఞాన్ రోవర్, విక్రం ల్యాండర్ లు విజయవంతంగా పూర్తి చేశాయని తెలిపింది.

చంద్రుడిపై రేపటి నుండి సెప్టెంబర్ 22 వరకు చిమ్మ చీకటి ఉండడంతో ప్రజ్ఞాన్ రోవర్, విక్రం లాండర్ లను స్లీప్ మోడ్ (PRAGNAN ROVER ON SLEEP MODE) లోకి పంపినట్లు ఇస్రో ప్రకటించింది. మరల సెప్టెంబర్ 22 తర్వాత ఇవి పనిచేయనున్నాయి.

ప్రజ్ఞాన్ రోవర్ ను స్లీప్ మోడ్ లోకి పంపిన ఇస్రో, విక్రమ్ ల్యాండర్ యొక్క డేటా పేలోడ్ ఆఫ్ చేసి పార్కు చేశారు.

ఇప్పటికే చంద్రుని ఉపరితలంపై ఉన్న ఉష్ణోగ్రతలను, చంద్రుని ఉపరితలంపై వచ్చే భూకంపాలను, చంద్రుని వద్ద ఉన్న మూలకాలను విజయవంతంగా చంద్రయాన్ – 3 గుర్తించింది.