CHANDRAYAAN – 3 కీలక ఘట్టాలు & పరికరాలు

BIKKI NEWS : చంద్రయాన్ – 3 చంద్రుని దక్షిణ ధ్రువాన్ని టార్గెట్ చేసుకొని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన 600 కోట్ల మిషన్. పోటీ పరీక్షల నేపథ్యంలో చంద్రయాన్ – 3 ప్రయోగంలో వినియోగించిన కీలక పరికరాలు మరియు కీలక ఘట్టాలను (chandrayaan – 3 key instruments and chronically incidents list) కాల క్రమం లో వరసగా చూద్దాం…

chandrayaan – 3 key instruments and chronically incidents list

జులై 14 – శ్రీహరి కోట నుంచి మొదలైన ప్రయాణం. తర్వాత శాస్త్రవేత్తలు దశల వారీగా భూకక్ష్య పెంపు విన్యాసాలు చేపట్టారు.

ఆగస్టు 1 – చంద్రుడి కక్ష్య వైపుగా పయనం

ఆగస్టు 5 – జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశం

ఆగస్టు 6, 9, 14, 16 – చంద్రుని కక్ష్య తగ్గింపు విన్యాసాలు

ఆగస్టు 17 – ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన ల్యాండర్ విక్రమ్

ఆగస్టు 18 – ల్యాండర్ విక్రమ్ వేగం తగ్గింపు తొలి ప్రక్రియ

ఆగస్టు 20 – వేగం తగ్గింపు రెండో ప్రక్రియ

ఆగస్టు – 23 : చంద్రుని దక్షిణ ప్రాంతంపై సాప్ట్ ల్యాండింగ్ కు సిద్ధం

◆ చంద్రయాన్ – 3 లో ఉన్న పెలోడ్స్

చంద్రయాన్-3 ల్యాండర్ (విక్రమ్), రోవర్ల (ప్రజ్ఞాన్) లలో మొత్తం 5 పేలోడ్లు ఉన్నాయి. జాబిల్లిపై వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి అంశాలను అవి నిశితంగా శోధిస్తాయి. అవి..

◆ VIKRAM LANDER :

బరువు: 1749.8 కిలోలు (రోవర్ తో కలిపి)
జీవితకాలం: 14 రోజులు (చంద్రుడిపై ఒక పగలు) పేలోడ్లు: 3

  • రాంభా-ఎల్‌పీ
  • చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పరిమెంట్ (ChaSTE)
  • ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ (ILSA)

◆ PRAGNAN ROVER :

బరువు: 26 కిలోలు, జీవితకాలం: 14 రోజులు, పేలోడ్లు: 2

  • ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్టోమీటర్
  • లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు