CHANDRAYAAN – 1, 2 , 3 విశేషాలు

BIKKI NEWS : Chandrayaan -1 and 2 and 3 comparision. భారత్ – ఇస్రో అంతరిక్ష రంగంలో రారాజు… అతి తక్కువ ఖర్చుతో అనేక విజయవంతమైన ప్రయోగాలు దాని సొంతం. తాజాగా CHANDRAYAAN – 3 SUCCESS కావడంతో ప్రపంచం చూపు భారత్ వైపు మళ్ళింది.

ఈ నేపథ్యంలో చంద్రుని మీద భారత్ చేపట్టిన యాత్రలు చంద్రయాన్ 1, చంద్రయాన్ – 2, చంద్రయాన్ -3 గురించి సంక్షిప్తంగా చూద్దాం.

Chandrayaan -1 and 2 and 3 comparision

CHANDRAYAAN – 1

అక్టోబర్ 22, 2008న శ్రీహరి కోట నుంచి చంద్రయాన్-1ను
ప్రయోగించారు. ఈ సక్సెస్ ఇస్రోలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ ప్రయోగం ద్వారా జాబిల్లి ధ్రువ ప్రాంతాల్లోని నీటి జాడ ఉందని చెప్పే ముఖ్యమైన డాటా లభ్యమైంది. చంద్రుడిపై ఎక్కడ దిగాలన్న దానికి సంబంధించి హై రిజాల్యూషన్ మ్యాప్ లను సమకూర్చింది.

CHANDRAYAAN – 2

చంద్రయాన్-2 ను జూలై 22, 2019న ఇస్రో విజయవంతంగా చేపట్టింది. ఆర్బిటార్, ల్యాండర్, రోవర్లను స్పేస్ క్రాఫ్ట్ లను చేర్చి.. చంద్రుడిపైకి పంపింది. చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తు
లోని కక్ష్య వరకు విజయవంతంగా వెళ్లింది. ల్యాండర్ విక్రమ్ ను వేరు పర్చే సంక్లిష్టమైన ప్రక్రియను చేపట్టడంలో సక్సెస్ అయ్యారు. సాఫ్ట్ లాండింగ్ వద్ద విఫలమైంది. ఆర్బిటార్ లోని 8 సైంటిఫిక్ పరికరాలు ఇప్పటికీ సమర్థంగా పని చేస్తున్నాయి. చంద్రుడిపై సోడియం లోహం పుష్కలంగా ఉందని గుర్తించింది.

CHANDRAYAAN – 3

జూలై 14, 2023 న ఇస్రో ప్రయోగించింది. ప్రగ్యాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై దిగి మట్టిని సేకరించటం, అందులో ఉండే మూలకాలను విశ్లేషించటం, నీటి జాడను గుర్తించటం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. అలాగే భూమి చంద్రుడి మధ్య దూరాన్ని అత్యంత కచ్చితంగా కొలవటం. అంతుబట్టని
విధంగా ఉన్న చంద్రుడి ఉపరితలం వాతావరణాన్ని ప్రగ్యాన్ రోవర్ మరింతగా శోధించనున్నది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు