ఉద్యోగాలు భర్తీతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించండి.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడం శుభ పరిణామమని, ఖాళీల సంఖ్యపై స్పష్టత కోసం శ్వేతపత్రం విడుదల చేసి ఉద్యోగాల భర్తీకి వెంటనే ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్ రెడ్డి అన్నారు.

అలాగే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని తెలిపారు. నిరుద్యోగ భృతి చెల్లింపునకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Follow Us@