సంస్కృతం పై వివరణ సరిపోదు, మెమోని రద్దు చేయాలి – సెస్ చైర్మన్ నాగటి నారాయణ

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సెకండ్ ల్యాంగ్వేజ్ గా సంస్కృతంను ప్రవేశపెట్టాలని ఇంటర్మీడియట్ విద్య కమీషనర్ నిన్న ఇచ్చిన మెమో పైన తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఈ రోజు క్లారిఫికేషన్ పేరుతో తప్పించుకుంటే సరిపోదని కమీషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ని ”సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్” (CES)’ కోరుతోంది.

సంస్కృత లెక్చరర్లు, స్కాలర్ల సంఘాల కోరికను పరిశీలించమని మాత్రమే కాలేజీలకు మెమో ద్వారా తెలియజేసినట్లుగా వివరణ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉన్నదని, మెమోలోనేమో అన్ని కాలేజీల్లో సెకండ్ ల్యాంగ్వేజ్ గా సంస్కృతంను ఇంట్రడ్యూస్ చేయాలని ఇనస్ట్రక్షన్స్ ఇచ్చి ఇప్పుడేమో అది రిక్వెస్ట్ మాత్రమే అంటే కుదరదని సెస్ చైర్మన్ నాగటి నారాయణ తెలిపారు.

దశాబ్ద కాలం పైగా ఖాళీగా ఉన్న 700 జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయకుండా సంస్కృత లెక్చరర్ పోస్ట్ కావాలంటే అడగండి శాంక్షన్ చేస్తామని మెమోలో చెప్పడం విచిత్రంగా ఉందని. కనుక క్లారిఫికేషన్ పేరుతో తప్పించుకోకుండా మెమో నం. 13/2021 ని వెంటనే రద్దు చేయాలని నాగటి నారాయణ డిమాండ్ చేశారు.