కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ ల సర్టిఫికెట్ ల జెన్యూనీటి పై ఆరా.

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా ఇంటర్మీడియట్ కమిషనర్ సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ లకు కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల అన్ని డిగ్రీల సర్టిఫికెట్ల జెన్యూనిటీని సంబంధిత యూనివర్సిటీల ద్వారా సేకరించి వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కోరడం జరిగింది.

సంబంధిత వివరాల సేకరణకు యూనివర్సిటీకి చెల్లించాల్సిన రుసుమును కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల నుండి వసూలు చేయమని సూచించడం జరిగింది.

ఇప్పటికే ప్రిన్సిపాల్ మరియు జిల్లా ఇంటర్ విద్య అధికారులు/ నోడల్ ఆఫీసర్ ల చేత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేసుకొని కమిషనరేట్ లో కూడా వెరిఫికేషన్ ప్రక్రియ గత రెండు నెలలుగా కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా జెన్యూనిటీ కోరుతూ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం విశేషం.

2016 – 17 లో కూడా కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయి కమిషనరేట్ స్థాయిలో రోస్టర్ కూడా పూర్తయిన విషయం తెలిసిందే.

Follow Us @