TGPSC – JL సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్

BIKKI NEWS (JULY 27) : CERTIFICATE VERIFICATION SCHEDULE OF JUNIOR LECTURER POSTS. ఇంటర్మీడియట్ విద్యాశాఖ పరిధిలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ యొక్క జనరల్ ర్యాంకింగ్ ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే.

CERTIFICATE VERIFICATION SCHEDULE OF JUNIOR LECTURER POSTS

ఈ నేపథ్యంలో 1:2 నిష్పత్తిలో అర్హత సాధించిన 2,724 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ను విడుదల చేశారు.అలాగే PWD అభ్యర్థులకు 1:5 నిష్పత్తి లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు అభ్యర్థుల జాబితా ను విడుదల చేశారు.

ఆగస్టు 05 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించనున్నారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అర్హత సాధించిన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లను చూడవచ్చు. మరియు ఏ రోజు ఎవరికీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉందో కూడా చూడవచ్చు.

అభ్యర్థులు ఒరిజినల్ తో పాటు రెండు కాపీల జిరాక్స్ సెట్ లను తీసుకొని నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయానికి తెలుపబడిన తేదీలలో హాజరు కావాల్సి ఉంటుంది.

పై తేదీలలో హాజరు కాలేకపోయినా అభ్యర్థులకు సెప్టెంబర్ 12, 13వ తేదీలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం రిజర్వుడేగా ప్రకటించారు. అభ్యర్థులు పై తేదీలలో కూడా హాజరయి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

TGPSC JL POSTS CERTIFICATE VERIFICATION SCHEDULE LINK

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు