వడ్డీ రేట్లకు భారీ కోత విధించిన కేంద్ర ప్రభుత్వం. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలు అవడంతో వివిధ పథకాల మరియు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు ఎప్రిల్ – 01 – 2021 నుంచి అమల్లోకి రానున్నాయి.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం పథకం యొక్క వడ్డీరేటును 7.4 శాతం నుండి 6.5 శాతానికి తగ్గించింది
సుకన్య సమృద్ధి యోజన పథకం వడ్డీ రేటు 7.6 శాతం నుండి 6.9 శాతానికి తగ్గింది.
కిసాన్ వికాస్ పత్రం వడ్డీ రేటు 6.9 నుండి 6.2 శాతానికి తగ్గింది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం వడ్డీ రేటును 7.1 శాతం నుండి 6.4 శాతానికి తగ్గించింది.
చిన్న మొత్తాల పొదుపు మీద 4 శాతం నుండి 3.5 శాతానికి తగ్గించింది.
ఒక సంవత్సరపు టర్మ్ డిపాజిట్ల మీద 5.5 శాతం నుండి 4.4 శాతానికి వడ్డీ రేట్లను తగ్గించింది.
రెండు సంవత్సరాల టర్మ్ డిపాజిట్ల మీద 5.5 శాతం నుండి 5.0 శాతానికి వడ్డీ రేట్లను తగ్గించింది.
మూడు సంవత్సరాల టర్మ్ డిపాజిట్ల మీద 5.5 శాతం నుండి 5.1 శాతానికి వడ్డీ రేట్లను తగ్గించింది.
