- జంట జలాశయాలకు గోదావరి జలాల తరలింపునకూ నిధులు ఇవ్వండి.
- కేంద్ర జల శక్తి మంత్రి సీ ఆర్ పాటిల్ కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి.
BIKKI NEWS (JULY 22) : CENTRAL GOVT SUPPORT FOR MUSI RIVER DEVELOPMENT. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర జల శక్తి మంత్రి సీ ఆర్ పాటిల్ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు.
CENTRAL GOVT SUPPORT FOR MUSI RIVER DEVELOPMENT
కాలుష్య బారిన పడి మురికి కూపంగా మారిన మూసీని శుద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిన బృహత్తర ప్రణాళిక గురించి ఈ సందర్భంగా సీఎం వివరించారు.
రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆవశ్యతను వివరిస్తూ మూసీ మురికి నీటి శుద్ధి పనులకు రూ. 4 వేల కోట్లు, గోదావరి నదీ జలాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను నింపే పనుల కోసం రూ. 6 వేల కోట్లు కేటాయించాలని కోరారు.
జంట నగరాలకు సంబంధించి ఈ రెండు జలాశయాలను గోదావరి జలాలతో నింపితే హైదరాబాద్ నీటి కొరత తీరుతుందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.
జాతీయ స్థాయిలో జల్ జీవన్ మిషన్ 2019 లో ప్రారంభమైనప్పటికీ ఈ పథకం కింద తెలంగాణకు ఇంత వరకు నిధులు ఇవ్వలేదని గుర్తు చేస్తూ ఈ ఏడాది నుంచి నిధులు కేటాయించాలని కోరారు.
తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని ఇందు కోసం పీఎంఏవై (అర్బన్ మరియు రూరల్) కింద చేపట్టే నల్లా కనెక్షన్ల కోసం రూ. 16.100 కోట్ల వ్యయం అవుతుందని ముఖ్యమంత్రి వివరించారు.