ఈసీల నియామకంపై సుప్రీం కీలక తీర్పు

న్యూడిల్లీ (మార్చి – 02) : కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకాలపై ప్రస్తుత విధానాన్ని రద్దు చేస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లతో కూడిన కమిటీ ఎలక్షన్ కమీషనర్ లను నియమించాలని ఆదేశించింది. ఇందుకోసం పార్లమెంటులో చట్టం చేయాలని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ప్రతిపక్ష నేత లేకపోతే విపక్షంలో మెజార్టీ పార్టీ సభ్యుడు కమిటీలో ఉండాలని.. కమిటీ సిఫార్సులతో ఈసీలను రాష్ట్రపతి నియమించాలని పేర్కొంది.