TGPSC – CDPO, ఎక్స్‌టెన్సన్ ఆఫీసర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

BIKKI NEWS (JULY 30) : CDPO and EXTENSION OFFICER EXAM NEW SCHEDULE. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022లో విడుదల చేసిన రెండు CDPO మరియు ఎక్స్‌టెన్సన్ ఆఫీసర్ నోటిఫికేషన్ల కోసం నిర్వహించిన పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు నోటిఫికేషన్ లకు సంబంధించిన నూతన పరీక్షల తేదీలను టీజీపీఎస్సీ ప్రకటించింది.

CDPO and EXTENSION OFFICER EXAM NEW SCHEDULE

CDPO ఉద్యోగ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్టు పద్దతిలో 2025 జనవరి – 3, 4 వ తేదీలలో నిర్వహించనున్నారు.

అలాగే ఎక్స్‌టెన్సన్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్టు పద్దతిలో 2025 జనవరి – 6, 7 వ తేదీలలో నిర్వహించనున్నారు.

CDPO నోటిఫికేషన్ (13/2022) మరియు ఎక్స్‌టెన్సన్ ఆఫీసర్ నోటిఫికేషన్ (11/2022) లకు సంబంధించి నిర్వహించిన రాత పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది.

ఈ పరీక్షల నిర్వహణపై సెంట్రల్ పోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ మరియు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చిన నివేదికలు ఆధారంగా పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

CDPO నోటిఫికేషన్ కు సంబంధించి రాత పరీక్ష ను జనవరి 03 – 2023 న మరియు ఎక్స్‌టెన్సన్ ఆఫీసర్ కు సంబంధించి రాత పరీక్షను జనవరి 08 – 2023 న నిర్వహించారు. ఈ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఎక్స్‌టెన్సన్ ఆఫీసర్ నోటిఫికేషన్ ద్వారా 181 పోస్టులను భర్తీ చేయనున్నారు. CDPO నోటిఫికేషన్ ద్వారా 23 పోస్టులను భర్తీ చేయనున్నారు.