సీడీఎల్స్ వేతనం నుంచి టీడీఎస్ కట్ చేయవద్దని వినతి

ఆదాయపు పన్ను శాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు డిగ్రీ అధ్యాపకుల వేతనాల నుండి టీడీఎస్ మినహాయించాలని నోటిసులు పంపిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్స్ (సీడీఎల్స్) కు ఆదాయపన్ను శాఖ విధించే 10% TDS నుంచి మినహాయింపు ఇవ్వాలని 475 సంఘం తరఫున ఈ రోజు ఇన్చార్జి డిగ్రీ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా కమీషనర్ ఉమర్ జలీల్ ఇంటర్మీడియట్ వ్యవస్థ లోని కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులకు కూడా టీడీఎస్ విషయంలో వేతనంలో కోత విధించకుండా చర్యలు తీసుకున్నామని‌, మీకు కూడా టీడీఎస్ కోత విధించకుండా చ‌ర్యలు చేపడతామని తెలిపారని రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో 475 రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి, వైకుంఠం, లక్ష్మీ నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us@