ఒక్క రోజు బ్రేక్ లేకుండా కాంట్రాక్టు లెక్చరర్ ల రెన్యూవల్ ప్రోసిడింగ్ – కొప్పిశెట్టి

తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు మరియు ఇతర సిబ్బందికి ఈ విద్యా సంవత్సరానికి గాను ఒక్కరోజు బ్రేక్ లేకుండా అనగా జూన్ 1 – 2020 నుండి మే 31 – 2021 వరకు కొనసాగిస్తున్నట్లుగా ఉన్నత విద్యా శాఖ కమిషనరేట్ విడుదల చేయడం జరిగింది.

తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్ అధ్యాపకులకు పన్నెండు నెలల వేతనం ఇస్తూ ఒక్క రోజు బ్రేక్ లేకుండా రెన్యువల్ ను ఇవ్వడం పట్ల 475 రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులకు కూడా త్వరలోనే రెన్యూవల్ ప్రోసిడింగ్ విడుదలకు కృషి చేస్తానని కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.

ఒక్క రోజు బ్రేక్ లేకుండా ప్రోసిడింగ్ విడుదల చేసిన సందర్భంగా వారు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర 475 అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేష్, అధికార ప్రతినిధులు కాంపల్లి శంకర్, జబీ, ఉదయశ్రీ, వైకుంఠం, ప్రవీణ్, ప్రవీణ్ కుమార్, శోభన్ లు పాల్గొన్నారు.

Follow Us @